అక్టోబర్ 24 న తెలంగాణకు రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీకి నివాళులు అర్పించిన రేవంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని.. ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు.
గొప్ప సిద్ధాంతం గాంధీ ఇజం చరిత్రలోనే నిలబడింది..యూగ పురుషుడిగా గాంధీజీ మనకు గర్వకారణం..వందల సంవత్సరాలు ఈ దేశం పై ఆధిపత్యం చేలాయిస్తన్న బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గుండెలనొడ్డి దేశానికి స్వాతంత్రo తెచ్చారన్నారు.
బీజేపీ అనే విషవృక్షం దేశాన్ని పేకిలించాలని చూస్తుందని.. బ్రిటిష్ వాళ్ళు అమలు చేసినట్టు విభజించు పాలించు నినాదాన్ని మోడీ ,కేసీఆర్ లు అమలు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రజల మధ్య గోడలు నిర్మించేలా చేస్తుందని.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఏకీకృతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.