టీఆర్ఎస్ జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేటీఆర్‌..!

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. కేసీఆర్‌ ఆలోచన మేరకు జాతీయ పార్టీగా పేరు మార్పిడి ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమవుతుంది. ఆ రోజు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఆమోదం అనంతరం మరుసటి రోజు అంటే ఈ నెల 6వ తేదీన దిల్లీకి టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్తుంది. టీఆర్ఎస్ పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) దరఖాస్తు చేసుకుంటుంది. దాన్ని ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది.

కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఉంటారు. తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రస్తుత టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమించే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా పేరుకు ఆమోదం తెలిపిన తర్వాత ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. దాన్ని అనుసరించి పార్లమెంటులో, శాసనసభలో, మండలిలో పార్టీ పేరు మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news