మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ కల్వకుంట్ల కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితమ్మ ఎత్తుకునే పూల బతుకమ్మ లోపల లిక్కర్ బాటిల్లే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయం కాదని అందరూ చెప్పారని.. లిక్కర్ స్కామ్ ను కప్పి పుచ్చుకోవడం కోసమే కొత్త పార్టీ నినాదమన్నారు మధు యాష్కీ.
కేసీఆర్ గాంధీ ప్రతినిధి కాదు..గాడ్సే ప్రతినిధి అని.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ మూతి పగల గొట్టాలని కోరారు. తన చేతిని తన నెత్తిన కేసీఆర్ పెట్టుకుంటున్నారని.. Brs కూడా కేసీఆర్ కి vrs లాంటిదని చురకలు అంటించారు. AP లో కొందరు వెలమలను కేసీర్ సంప్రదిస్తున్నారని.. తన కుల సామ్రాజ్యం పెంచుకోవడమే కేసీఆర్ కు పని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. APని తిట్టిన కేసీఆర్… ఇప్పుడు ap కి ఎలా వెళ్తారని..నిలదీశారు.