బ్లాక్​ డ్రెస్​లో ఆలియా బేబీ బంప్​​ ఫొటోషూట్​.. ధర ఎంతో తెలుసా?

-

ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలతో అలరించిన ఆలియాభట్‌.. తాజాగా సింగపూర్‌లో ‘టైమ్‌ 100 ఇంఫాక్ట్‌’ పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్భంగా బేబీ బంప్​తో బ్లాక్​ డ్రెస్​లో దిగిన కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది ఆలియా. అయితే ఆ డ్రెస్​ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

బేబిబంప్​తో ఆలియాభట్ ధరించిన ఆ డ్రెస్​ ధర రూ.1.80 లక్షలంట. అయితే ఈ సందర్భంగా బ్లాక్​ డ్రెస్​లో దిగిన కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది ఆలియా. అంతే కాకుండా సింగపూర్‌లో ఆలియా తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

‘‘10 ఏళ్ల క్రితం నేను నటించడం ప్రారంభించినప్పుడు ఎంత కష్టమైన భరించాలని నిర్ణయించుకున్నా. నా కష్టాన్ని ప్రపంచం గుర్తించాలని కోరుకున్నా. భావోద్వేగాలను పండించడానికి ఎంత కష్టమైనా పడతాను.

నా శరీర బరువు, రూపాన్ని కాపాడుకోడానికి కఠినంగా ఉంటాను. కానీ నేను ఫ్రెంచ్‌ఫ్రైస్‌ తినడానికి ‘నో’ చెప్పను. ఎందుకంటే మనం ఒక్కసారి మాత్రమే జీవిస్తాం. అందుకే ఆనందంగా ఉండాలి’’ అని తెలిపింది.

ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా భర్త రణ్‌బీర్‌ కపూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నేను వీళ్లందరికీ విడివిడిగా అవార్డులు ఇవ్వాలి. ఇంతకంటే అద్భుతమైన విషయం ఏంటంటే నా ప్రసంగం అంతా విని నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను తంతున్నాడు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించింది అలియా.

Read more RELATED
Recommended to you

Latest news