సందీప్ రెడ్డి బాలీవుడ్ కా! టాలీవుడ్ కా?

-

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సందీప్ వంగ పేరిప్పుడు బాలీవుడ్ లో మారుమ్రోగిపోతోంది. క‌బీర్ సింగ్ హిట్ తో షాహిద్ క‌పూర్ కెరీర్ కే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. 300 కోట్ల వ‌సూళ్ల‌తో సునామీ సృష్టించాడు. తెలుగోడు బుర్ర‌కి ప‌దును పెడితే ఎలా ఉంటుందో బాలీవుడ్ కి చాటి చెప్పాడు. తెలుగు ట్యాలెంట్ ను విమ‌ర్శించిన వాళ్లంద‌రికీ క‌బీర్ సింగ్ ఓ చెంప దెబ్బ. రివ్యూలు నెగిటివ్ గా వ‌చ్చినా సందీప్ వంగ ముందు చిన్న‌బోయాయి. ఈ న‌యా ట్యాలెంట్ బాలీవుడ్ కొన‌సాగిస్తుడా? టాలీవుడ్ లా కొన‌సాగుతాడా? అన్న‌ది సెకెండ‌రీ. బాలీవుడ్ యంగ్ హీరోలంతా ఇప్పుడు సందీప్ తో సినిమా చేయ‌డానికి అమితాస‌క్తి చూపిస్తున్నారు. అంతా హిట్ మ‌హిమ‌. అయితే ఈ విష‌యాన్ని గ్ర‌హించిన బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ సందీప్ ని లాక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడుట‌.

Sandeep Vanga Bollywood Or Tollywood

ట్యాలెంట్ ను ప‌ట్టుకోవ‌డంలో క‌ర‌ణ్ దిట్ట అని చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లితో అంత‌ర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించిన ప్ర‌భాస్ ని బాలీవుడ్ కి తీసుకెళ్లిపోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసాడు. కానీ మాతృభాష త‌ర్వాతే ప‌ర‌భాష‌ని ప్ర‌భాస్ క‌రాఖండీగా చేప్పేయ‌డంతో క‌ర‌ణ్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. తాజాగా ఇప్పుడు క‌ర‌ణ్ క‌న్ను సందీప్ పై ప‌డింది. త‌న బ్యాన‌ర్లో సందీప్ నుంచి రెండు, మూడు సినిమాల‌కు క‌మిట్ మెంట్లు తీసుకునేలా స‌న్నాహాలు చేస్తున్న‌డుట‌. దీనిలో భాగంగా భారీ రెమ్యున‌రేష్ కూడా ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు ఉప్పందింది. మూడు ప్రాజెక్ట్ ల‌కు బ‌ల్క్ గా పారితోషికం మాట్లాడే దిశ‌గా ఆలోచ‌న వేస్తున్నాడుట‌. ప్ర‌భాస్ ని వ‌దిలినంత ఈజీగా సందీప్ ను వ‌దులుకోకూడ‌ద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ప్రపోజ‌ల్ ఇప్ప‌టికే సందీప్ వ‌ద్ద‌కు మ‌ధ్య‌వ‌ర్తుల‌ ద్వారా వెళ్లిందిట . ఆయ‌న కూడా సానుకూలంగానే సంకేతాలు ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఎన‌లిస్టులు కూడా సందీప్ క‌ర‌ణ్ కి మాటిచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయంటున్నారు. ఎందుకంటే అర్జున్ రెడ్డి క‌థ‌ ప‌ట్టుకుని సందీప్ తెలుగులో చాలా మంది నిర్మాత‌లు చుట్టూ తిర‌గాడు. క‌థ బాగుంద‌నేవారు కానీ…డెబ్యూ కావ‌డంతో నిర్మించ‌డానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. ఆ ర‌కంగా టాలీవుడ్ నిర్మాత‌ల‌పై కొంత అసంతృప్తి ఉంది. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ ఆఫ‌ర్ కి సందీప్ ఒకే చెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌స‌రం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news