బాలీవుడ్ నిర్మాత‌ల‌కు టాలీవుడ్ నిర్మాత‌లు ఎస‌రు?

-

ఇటీవ‌ల కాలంలో తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయి మంచి విజ‌యాలు సాధిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఊహించ‌ని విధంగా వంద‌ల కోట్లు వ‌సూళ్లు తెచ్చి పెడుతున్నాడు. ఇటీవ‌లే అర్జున్ రెడ్డి అక్క‌డ షాహిద్ క‌పూర్ హీరోగా సందీప్ వంగ ఇద్ద‌రు బాలీవుడ్ నిర్మాత‌ల‌తో క‌లిసి రీమేక్ చేసి విడుద‌ల చేసాడు. క‌ట్ చేస్తే 300 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ సినిమా బ‌డ్జెట్ కూడా త‌క్కువే. కానీ క‌థ‌లో విష‌యం ఉండ‌టంతో వంద‌ల కోట్లు కొల్ల‌గొట్టింది. నిర్మాత‌ల ఇంట కాసుల పంట పండింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన అల్లు అర‌వింద్- దిల్ రాజు ఇలాంటి క‌థ‌లు మ‌న‌మే అక్క‌డెందుకు నిర్మించ‌కూడదు? అన్న థాట్ వ‌చ్చింది. అందుకే ఇప్పుడు జెర్సీని బాలీవుడ్ లో నిర్మించ‌డానికి ముందుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

tollywood producers big plane

నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం లో తెరకెక్కిన‌ జెర్సీ ఆ మ‌ధ్య విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. భారీ లాభాలు తీసుకురాక‌పోయినా నాని ఇమేజ్ తో సినిమా న‌ష్టాలు లేకుండా బ‌య‌ట ప‌డింది. కానీ సినిమాకు మంచి రివ్యూల‌తో పాటు ఏ క్లాస్ పీపూల్స్ ని బాగా ఆక‌ట్టుకుంది. కొన్ని వ‌ర్గాల ను మాత్రం అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. లేదంటే మ‌జిలీ లా 70 కోట్లు వ‌సూళ్లు తెచ్చేదే. అయితే ఇలాంటి క‌థ‌లు ఉత్త‌రాదిన బాగా స‌క్సెస్ అవుతాయి. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన బ‌యోపిక్ లు అక్క‌డ వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాయి. జెర్సీ కూడా ఫిక్ష‌న‌ల్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ బ‌యోపిక్ లా సాగుతుంది. కాబ‌ట్టి స‌క్సెస్ అవ్వ‌డానికి ఛాన్సెస్ ఎక్కువ‌గానే ఉన్నాయి.

అందుకే సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నుంచి దిల్ రాజు -అర‌వింద్ రైట్స్ తీసుకుని బాలీవుడ్ లో నిర్మించ‌డానికి రెడీ అవుతున్నారు. ఇందులో హీరో ఎవ‌రు? ప‌్రాజెక్ట్ ను టేక‌ప్ చేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది. జెర్సీ స‌క్సెస్ రేటు గ‌నుకు బాగుంటే! ఈ ద్య‌యం ఇక్క‌డి క‌థ‌ల్ని అక్క‌డ రీమేక్ చేయ‌డం ఖాయ‌మ‌నే తెలుస్తోంది. ఇదే కంటున్యూ చేస్తే బాలీవుడ్ నిర్మాత‌ల‌కు ఎస‌రు పెట్టినట్లే. ఇక అర‌వింద్ కు బాలీవుడ్ నిర్మాణం కొత్తేం కాదు. గ‌తంలో గ‌జినీ చిత్రాన్ని అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడిగా హిందీలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news