ఆసరా పింఛన్లు ఇచ్చినట్టే ఇచ్చి..తీసేస్తున్నారు – విజయశాంతి

-

ఆసరా పింఛన్లు ఇచ్చినట్టే ఇచ్చి..తీసేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ సర్కార్ పేద ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. ఆసరా పింఛన్లు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని మళ్లీ తీసేస్తున్నరు. అప్లికేషన్లు తీసుకున్న మూడున్నరేండ్ల తర్వాత ఇటీవల పింఛన్లు శాంక్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… నెల రోజులకే అనర్హులున్నారని కట్​ చేస్తుండడంతో ఏం చేయాలో లబ్ధిదారులకు తెలియక అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహించారు.


కానీ ఫలితం మాత్రం లేదు. మూడెకరాల భూమి, సొంత కారు ఉన్న వారి వివరాలను సీసీఎల్ఏ, ఆర్టీఏ ఆఫీసుల నుంచి తీసుకున్న అధికారులు ఏరివేత ప్రక్రియ చేపట్టారని వెల్లడించారు. అయితే క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయకుండా తొలగిస్తుండడంతో అర్హులైన వారు కూడా పింఛన్లు కోల్పోతున్నరు. సూర్యాపేట జిల్లాలో గతంలో మొత్తం 1,23,006 మంది ‘ఆసరా’ లబ్ధిదారులున్నారని చెప్పారు.

వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికుల పింఛన్లకు చెందిన 13,761 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నయి. దానికి తోడు పింఛన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు ప్రభుత్వం తగ్గించడంతో కొత్తగా 26,704 మంది అప్లై చేసుకున్నరు. ఈ లెక్కన జూన్ నుంచి కొత్త పింఛన్లు శాంక్షన్ ​చేసిన ప్రభుత్వం… 34,882 మంది అర్హులను గుర్తించి కార్డులను జారీ చేసింది. తాజాగా వెరిఫికేషన్ పేరుతో 1,400 మంది పింఛన్లను తొలగించారు. ఈ ప్రక్రియ కూడా సజావుగా జరగలేదు. అధికారులు కూడా ఎక్కడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఏం కేసీఆర్… పేదల బతుకులతో ఇలాగేనా ఆడుకునేది? ఈ పేదలు నీకు త్వరలోనే తగిన జవాబు చెబుతారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news