తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు పడ్డాయి. అయితే.. ఈ వర్ష ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉన్నదని.. వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల పాటు, తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాక స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో భీభత్సంగా వర్షాలు పడుతాయని పేర్కొంది. ఇక అటు, హైదరాబాద్ మహా నగరంలో.. భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న కూడా అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహీల్స్, షేక్ పేట్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఇవాళ, రేపు కూడా హైదరాబాద్ లో వర్షాలు పడనున్నాయి.