దేశానికి ఎన్నో కప్పులు, ఎన్నో విజయాలు అందించిన ధోనీ ప్రస్తుతం ఫామ్ లో లేడు. మొన్నటి ప్రపంచ కప్ లో ఆయన పేలవ ప్రదర్శనను ప్రపంచమంతా చూసింది. ధోనీ టైమ్ పాస్ చేస్తూ బంతులను మింగుతూ పరుగులు తీయకుండా… సెమీస్ లో భారత్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడంటూ విమర్శలు కూడా వచ్చాయి.
ఎంఎస్ ధోనీ.. టీమిండియా క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటిన వ్యక్తి. మిస్టర్ కూల్, మ్యాచ్ ఫినిషర్ అంటూ ఆయనకు ఎన్నో పేర్లు. 2011 లో ఇండియా వరల్డ్ కప్ సాధించిందంటే దానికి కారణం కేవలం ధోనీయే. ధోనీ వల్లే ఇండియాకు కప్పు వచ్చింది.
దేశానికి ఎన్నో కప్పులు, ఎన్నో విజయాలు అందించిన ధోనీ ప్రస్తుతం ఫామ్ లో లేడు. మొన్నటి ప్రపంచ కప్ లో ఆయన పేలవ ప్రదర్శనను ప్రపంచమంతా చూసింది. ధోనీ టైమ్ పాస్ చేస్తూ బంతులను మింగుతూ పరుగులు తీయకుండా… సెమీస్ లో భారత్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడంటూ విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచ కప్ నడుస్తున్న సమయంలో ప్రపంచ కప్ ముగిశాక ధోనీ రిటైర్ అవుతారంటూ వార్తలు కూడా వచ్చాయి. ప్రపంచ కప్ అయిపోయినా.. ధోనీ మాత్రం తన మౌనాన్ని వీడలేదు.
తర్వలో భారత్.. వెస్టిండీస్ టూర్ కు వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ధోనీని ఎంపిక చేస్తారా? లేదా? అన్న సందిగ్దం నెలకొన్నది. అయితే… టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోర్ ఏమంటారంటే… జట్టులోని ప్లేయర్ల ప్రదర్శనను సమీక్షించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం సెలెక్టర్ల ప్రధాన కర్తవ్యమన్నారు.
అందుకే.. టీమ్ లోని ఆటగాళ్లు ఏ స్థానలకు సరిపోతారు.. అనే విషయాలపై సెలెక్టర్లకు క్లారిటీ ఉండాలన్నారు. కాకపోతే.. ప్లేయర్లలో ఎటువంటి అభద్రతాభావం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అందుకే.. ధోనీ భవిష్యత్తు గురించి… సెలెక్టర్లు ఆయనతో మాట్లాడితే మంచిదని… ధోనీ నిర్ణయాలను గౌరవిస్తూనే.. ఆయనకు ఏం చేయబోయేది వివరించాలని.. టీమ్ బలోపేతం కోసం ఏం చేయాలనుకుంటున్నారో తెలపాలన్నారు. అలా అయితే.. ఆటగాళ్లు కూడా ఎటువంటి ఆందోళన చెందరని.. ఒకవేళ ఏదైనా టోర్నీలో చోటు లభించకున్నా.. సెలెక్టర్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటారని సూచించారు.
అయితే.. వెస్టిండీస్ టూర్ కోసం భారత జట్టును సెలెక్టర్లు రేపు ప్రకటించనున్నారు. మరి.. ఈ 38 ఏళ్ల ఫినిషర్ ను సెలెక్ట్ చేస్తారా? లేదా? అంటే రేపటి దాకా వేచి చూడాల్సిందే.