ఘనంగా బిగ్ బాస్ భానుశ్రీ బర్త్ డే సెల్రేషన్స్..!

-

బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న భాను శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. జాబిలమ్మ, వాణిరాణి వంటి సీరియల్స్ తో పాటు గోల్డ్ రష్ , టాలీవుడ్ స్క్వేర్స్ వంటి టీవీ షోలతో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇద్దరి మధ్య 18 , నల్లమల, కుమారి 21 F, మర్ల పులి, బాహుబలి ది బిగినింగ్, కాటమరాయుడు, ఏడు చేపల కథ వంటి చిత్రాలలో నటించింది. కానీ సినిమాల ద్వారా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు.

ఇక తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారమే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించిన ఈమె నాలుగు వారాలకు మించి అక్కడ కొనసాగ లేకపోవడం ఆశ్చర్యకరం.

భాను శ్రీ ఒక మంచి డాన్సర్ కూడా.. ఇక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈమెకు వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా భాను శ్రీ తన పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు కూడా బర్తడే వేడుకలకు హాజరవడం జరిగింది. ముఖ్యంగా బిగ్ బాస్ సెలబ్రిటీలు ఈమె బర్తడేను చాలా ఘనంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరితో కలివిడిగా ఉండే భాను శ్రీ కి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎందుకు తెచ్చుకోలేదు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అలాగే డాన్స్ రీల్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది.

ఈ క్రమంలోనే తన బర్తడే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె బర్తడే పార్టీకి అషు రెడ్డి , సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, నిఖిల్ విజయేంద్ర సింహం, యాంకర్ రవి వంటి వారు వేడుకలలో పాల్గొన్నారు. ఇక ఈ ఫొటోలు కాస్తా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Bhanu shree (@iam_bhanusri)

 

Read more RELATED
Recommended to you

Latest news