నిధి అగర్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2015లో మున్నా మైకేల్ అనే హిందీ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత అఖిల్ అక్కినేని తో మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించింది. కానీ అక్కినేని అన్నదమ్ములిద్దరూ కూడా నిధికి ఒక మంచి హిట్ అందివ్వలేకపోయారు. రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ లో ఈమె నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమాతోనే నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ తర్వాత నిధి అగర్వాల్ దశతిరిగినట్టే అని అంతా భావించారు. కానీ ఆమె కెరియర్ కూడా చాలా నెమ్మదిగా సాగుతోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు జోడిగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ మూవీకి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలబోతోంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన నిధి అగర్వాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నిధి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. అందం కూడా చూపించుకోవాలి అంటూ తెలిపింది. ఇక గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడకూడదు. అప్పుడే అవకాశాలు వస్తాయని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఇస్తారు అంటే అందంగా ఉందా ? లేదా? అన్నది చూసాకే ఆఫర్ ఇస్తారని, కేవలం టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు అంటూ తెలిపింది.
ఇకపోతే పెద్ద హీరోలతో సినిమా చేస్తే ఆ తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని అందుకే పెద్ద హీరోల సినిమాలలో అవకాశం వస్తే అసలు వదులుకోనని కూడా తెలిపింది . కనీసం ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సింది.