వచ్చే ఎన్నికల్లో జనసేన ఓడిపోతే పరిస్థితి ఏంటి?

-

ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి..తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెల్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలు కూడా పవన్ కు ఎదురవుతున్నాయి.తీవ్ర అసహనానికి లొనయ్యిన ఆయన కోపాన్ని అదుపులో ఉంచుకోలేరని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. తాజాగా ఆయన మాట్లాడుతూ ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని కామెంట్ చేశారు..

గత ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలు చేయగా 120 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆ డబ్బులలో ఎక్కువ మొత్తం డబ్బును సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేశానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.నా సహనం ఇంతకాలం కాపాడిందని ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే మర్యాదగా ఉండదని పవన్ పేర్కొన్నారు. మొదటి భార్యకు 5 కోట్ల రూపాయల భరణం ఇచ్చానని రెండో భార్యకు ఆస్తి రాసి ఇచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు నుంచి వైసీపీతో యుద్ధం చేస్తానని పవన్ వెల్లడించారు. వైసీపీలోని కాపు నేతలు జగన్ కు ఊడిగం చేసుకోవాలని కాపులను మాత్రం లోకువ చేయవద్దని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో త్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ లోని 7 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం తప్ప ఆలోచన లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో కూడా జనసేనను ఓడిస్తే ఏం చేస్తావ్ పవన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు నమ్మని చంద్రబాబును పవన్ ఎందుకు నమ్ముతున్నారని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఇక ఇవే ప్రశ్నలు ప్రజల్లో కూడా వ్యక్తం అవుతున్నాయని తెలుస్తుంది.
పవన్ ప్యాకేజ్ తీసుకోకపోతే 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కు వైసీపీపై అంత పగ ఎందుకు అని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ తన ప్రాజెక్ట్ లను సరైన సమయంలో పూర్తి చేయకపోవడం వల్ల నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాతల ఇబ్బందులను పవన్ పట్టించుకుంటే మంచిదని,ఆ తర్వాత ప్రజలకు హామీలు ఇవ్వొచ్చునని కొందరు అంటున్నారు.. మరి ఈ రాజకీయ చర్చలు ఎక్కడివరకువెలతాయో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news