కోమటి రెడ్డి కుటుంబం బిజెపికి అమ్ముడుపోయిందని ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రి జగదీష్ రెడ్డి… మాట్లాడుతూ.. నాలుగు ఏళ్లుగా రాజ్ గోపాల్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడని.. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు. కెసిఆర్ ను దగ్గరికి వెళ్లగలిగే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని మునుగోడు ప్రజలను కోరుతున్నానని.. మునుగోడు ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించింది కెసిఆర్ అని వెల్లడించారు.
అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. గత ఏడాది కేంద్ర మంత్రి పార్లమెంట్ లో మిషన్ భగీరథ ద్వారా ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పారన్నారు. కాళేశ్వరం మొదటి పలితం తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అని.. వ్యక్తులకు ఉన్న సానుభూతి తోనే బిజెపి రెండు సీట్లను గెలిచిందని పేర్కొన్నారు. కెసిఆర్ ను అడ్డుకునేందుకే , కాంగ్రెస్ నీ బలహీన పర్చాలని బిజెపి వేసిన ఎత్తుగడ అన్నారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 3 యేళ్ళుగా బిజెపి తో టచ్ లో ఉన్న అని చెప్పుకున్నాడని.. అయన కాంట్రాక్ట్ కోసం కుటుంబ స్వార్థం కోసం బిజెపి లో చేరారని ఫైర్ అయ్యారు.