మునుగోడు లో ప్రచార వ్యూహం మార్చిన బిజెపి

-

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార హోరుతో దూసుకెళ్తున్నాయి. అయితే ఓటర్లను మరింత ఆకర్షించేందుకు ప్రచార వ్యూహాన్ని మార్చాలంటూ రాష్ట్ర నేతలకు బిజెపి అధిష్టానం ఆదేశాలు పంపింది. నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ ఒకటవ తేదీ సాయంత్రం లోపే ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్ ఒకటవ తేదీ వరకు నేతలంతా మునుగోడు లోనే ఉండాలని అధిష్టానం పేర్కొంది. ఎవరు హైదరాబాద్ రావద్దని.. ప్రచారంపైనే దృష్టి పెట్టాలని ఆదేశించింది.

టిఆర్ఎస్ అవినీతిని ప్రజలకు తెలియజేసి ఓట్లు అభ్యర్థించాలని అదిస్టానం సూచించింది. రాత్రి కూడా మునుగోడు లోనే బస చేయాలని నాయకులను ఆదేశించింది. పార్టీలో చేరికల కన్నా మునుగోడు ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి దృష్టిసారించాలని స్పష్టం చేసింది. అయితే బిజెపి స్టీరింగ్ కమిటీలో ఉన్న ఇద్దరు నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఉప ఎన్నికలో కమలనాధులు వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. ఈ నేపద్యంలోనే కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు బిజెపి నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news