బరువు పెరగడానికి కారణాలు ఏమైనా కావొచ్చు..తగ్గడానికి మాత్రం దారులు ఒకటే.. హెల్తీ లైఫ్‌స్టైల్‌ను హెల్తీగా మెయింటేన్ చేయాలి..ఫాస్ట్ ఫుడ్స్‌ను ఫాస్ట్‌గా దూరం పెట్టేసి..జంక్ ఫుడ్‌ను జంప్ చేసి..పండ్లు, కూరగాయలు, వ్యాయామాలు వైపు అడుగులు వేయాలి.. ఇదేం పెద్ద సమస్యకాదు. మీరు బరువు పెరగడానికి కారణం ఏంటి అనేది తెలిస్తే.. తగ్గడం తేలికే.. అయితే మీకు అమర్‌ఫల్ గురించి తెలుసో లేదో.. ఇది అధిక బరువును ఈజీగా తగ్గిస్తుందట..
మన దేశంలో ఈ పండుకు చాలా డిమాండ్ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు… దాని కోసం ఎగబడుతున్నారు. అమర్‌ఫల్ (Amarfal) పండును ఇంగ్లీష్‌లో పెర్సిమోన్ (Persimmon) అంటారు. ఇది చైనా, జపాన్ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది.
అమర్‌ఫల్ పండు ప్రయోజనాలు..
ఈ పండులో విటమిన్ల నిధి. ఇందులో విటమిన్ -ఎ పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
విటమిన్ సి, ఇ, కె, బి1, బి2, విటమిన్ బి6, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ పండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక గుండె వ్యాధుల కాపాడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, క్వెర్సెటిన్స్.. మీ గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈరోజుల్లో యువతీ యువకులు ఊబకాయం, అధిక పొట్టతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏం చేస్తాం ఇష్టమైన ఫుడ్ చూస్తే కంట్రోల్ చేసుకోలేం..ఫలితంగా బాడీ షేప్ మారిపోతుంది. మనం ఎంత ఫాస్ట్ ఫుడ్స్ తిన్నా..జిమ్‌కు వెళ్లడమో, ఇంటి దగ్గరే గంటపాటు వ్యాయామాలు చేయడమో విధిగా పెట్టుకుంటే..బరువు పెరగరు, ఇష్టం వచ్చింది తినొచ్చు. మీ టైమ్‌లో గంటను వ్యాయామాలకు కేటాయించలేరా..? కొంచెం మేనేజ్ చేసుకుంటే చేసేయొచ్చు…ఈ పండును తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో మీరు తర్వాత ఏదీ తినలేరు. ఒకవేళ తిన్నా ఎక్కువగా తీసుకోలేరు. ఇంకా ఈ పండు జీర్ణవ్యవస్థకు బాగా పనిచేస్తుంది.