రాష్ట్ర ప్రజల డబ్బును సీఎం కేసీఆర్ బందిపోటులా దోచుకుంటున్నాడని మండిపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాలేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరుపుతామని సిబిఐ, కాగ్ హామీ ఇచ్చాయని షర్మిల తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో జాతీయస్థాయిలో అవినీతి జరిగిందని మండిపడ్డారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి తోడు దొంగలు అయితే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీతగాళ్ళని కామెంట్ చేశారు. మునుగోడులో టిఆర్ఎస్ గెలుస్తోందని అనుకుంటున్నానని అన్నారు.
తనకి ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్ అని అన్నారు. వచ్చే ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్ట్ బ్రదర్స్ అని విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చని బిజెపి మునుగోడులో సిగ్గులేకుండా ఓట్లు అడుగుతోందని ఫైర్ అయ్యారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల తెలంగాణలో ఒరిగేదేమీ లేదన్నారు.