రామ్ చరణ్ జూ ఎన్టీఆర్ దంపతుల ఎంజాయ్ మామూలుగా లేదుగా..!!

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో  దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తన దర్శక ప్రతిభతో తెలుగు సినిమా ను ప్రపంచ స్థాయిలో నిలిపాడు. ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల స్క్రీనింగ్ అయ్యి ఇతర దేశాల ప్రేక్షకులను అబ్బుర పరిచింది. రాజమౌళి సినిమా విడుదల అయి చాలా రోజులు అయినా కూడా ఇప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లోనే బీజీగా గడుపుతున్నారు. 

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ను ఇప్పుడు  ప్రపంచ స్థాయిలో నిలబట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని జపాన్ భాషలో రిలీజు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.ప్రస్తుతం రాజ మౌళి రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లతో ప్రస్తుతం జపాన్ లో ప్రమోషన్లో పాల్గొంటూ వున్నారు. ఇప్పటికే రాంచరణ్, జూ ఎన్టీఆర్ ఇద్దరూ అక్కడి అభిమానుల తో ముచ్చటిస్తున్న వీడియోస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ పర్యటనలో మరోసారి జపాన్‌ వీధుల్లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సతీసమేతంగా సందడి చేశారు. రద్దీగా ఉండే ప్రాంతంలో నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీలు చేతిలో పట్టుకొని, ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసి కొంత దూరం నవ్వుకుంటూ నడుస్తూ వెళ్ళారు. ఈ  వీడియోను రామ్‌చరణ్‌ తన ట్విటర్‌ అకౌంట్ లో పోస్టు చేశారు. అలాగే ఫీల్ కోసం ఈ వీడియోకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘దోస్తి’ పాటను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news