తెలంగాణకు కేసీఆర్‌ను పరిమితం చేసేలా కుట్రలకు పాల్పడుతున్నారు : మంత్రి జగదీశ్‌రెడ్డి

-

సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్‌ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారని పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ గెలవదు అని తేల్చిచెప్పారు మంత్రి జగదీశ్ రెడ్డి. కేంద్రంలో మోదీ ఇమేజ్ కూడా రోజురోజుకు తగ్గుతుందన్నారు. బీజేపీకి కేసీఆర్‌ భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి మూడోసారి కూడా గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణకు కేసీఆర్‌ను పరిమితం చేసేలా కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. గుజరాత్‌లో మోటార్లకు మీటర్లు పెట్టారు మంత్రి జగదీశ్ రెడ్డి.

Electric vehicle charging station for every 25 kilometres: Minister Jagadish  Reddy

గత ప్రభుత్వాలు మునుగోడు ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపలేదు. ఆరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌కు చెక్ పెట్టింది మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ కాంగ్రెస్ నేతలు ఎదిగారు తప్ప అక్కడి సమస్యలు మాత్రం తీర్చలేదు. వ్యక్తుల ప్రాబల్యంతోనే గత ఉప ఎన్నికల్లో గెలిచారు తప్ప బీజేపీతో కాదు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి ఆ స్థానంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో టచ్‌లో ఉన్నానని చెప్పటం దిగజారుడుతనమని నిప్పులు చెరిగారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఒక వ్యక్తిని కొనటానికి మోదీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ. 18 వేల కోట్ల కాంట్రా క్ట్ వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థే.. ప్రజల్లో మాత్రం బలహీన అభ్యర్థి అని విమర్శించారు మంత్రి జగదీశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news