సినీ ఇండస్ట్రీలో ఎన్ని అవకాశాలు వస్తున్నా సెలెక్టివ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో పూర్ణ కూడా ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్గా నటించిన ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. అంతేకాదు పలు టీవీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది. ఇకపోతే పూర్ణ ప్రేమ , పెళ్లి గురించి రకరకాల వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. ప్రేమ పేరుతో ఒక ముఠా తనను మోసం చేసిందని, ఆ మధ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది.
అదేవిధంగా ఈమె మళ్లీ ప్రేమలో పడిందని త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం కూడా సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేసింది. ఇక అలాంటిది ఎట్టకేలకు ఇటీవల తనకు ప్రియుడు ఉన్నాడని.. ఆ విషయాన్ని ఇద్దరు దిగిన ఫోటోలతో సహా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పూర్ణ. అతడి పేరు ఆసీఫ్ అలీ. ఇతడు అరబ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. అయితే ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ బ్రేకప్ అయిందని ప్రచారం కూడా ఈమధ్య బాగా జరిగింది. అయితే ఎన్ని ప్రచారాలు జరిగినా ప్రస్తుతం పూర్ణ , ఆసిఫ్ అలీ దుబాయ్ లో ఉన్నారు. దీని గురించి నటి పూర్ణ ఓ భేటీలో పేర్కొంటూ తమ వివాహా , నిచ్చితార్థం ఈ ఏడాది మే నెల 31వ తేదీన జరిగిందని , జూన్ నెల 12వ తేదీన దుబాయ్ లో పెళ్లి అత్యంత సన్నిహితులు సమక్షంలో జరిగిందని తెలిపింది.
దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేకపోయారని , దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఒక నాట్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు చెప్పిన పూర్ణ ఇది తన చిరకాల కోరిక అని కూడా తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.