జగన్ మళ్లీ సీఎం కాకపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా – ధర్మాన

-

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్…రెండు రోజుల కిందట… తన పదవికి రాజీనామా చేస్తానని జగన్‌ దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే… ఆ ఎపిసోడ్ మరువక ముందే.. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసిపి గెలవబోతోందని, జగన్ మళ్ళీ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు.

అలా జరగకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తానంటూ చెప్పుకోచ్చారు. ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమని ప్రకటిస్తున్న వేళ, ధర్మాన కృష్ణ దాస్ నోటివెంట ఈ మాట రావడం ఆసక్తికరంగా మారింది.

‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కృష్ణ దాస్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అంటూ జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండా 175 స్థానాల్లో పోటీ చేస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news