కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. కేంద్రం అందించే స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది.
బేటీ బచావో, బేటీ పఢావో అనే స్కీమ్‌లో భాగంగా సుకన్య సమృద్ధి యోజనను తీసుకొచ్చింది. పదేళ్లు లోగా వున్నా ఆడపిల్లల పేరుతో ఈ స్కీమ్ ని ఓపెన్ చెయ్యచ్చు. ఆడపిల్లల పేరు మీద రూ.250ను డిపాజిట్ చెయ్యచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. అధికారిక బ్రాంచు శాఖ లేదా పోస్టాఫీసు లో ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు పిల్లలకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత అకౌంట్ నుంచి డబ్బులను డ్రా చెయ్యచ్చు. 9 ఏళ్ల నాలుగు నెలలకి ఈ డబ్బులు రెట్టింపు అవుతాయి. 18 ఏళ్లు వచ్చిన తర్వాత 50 శాతం మనీని విత్ డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్లు వచ్చాక మనీని వెనక్కి తీసుకోవచ్చు. రోజుకి రూ.416 సేవ్ చేస్తే ఏడాదికి రూ.1.5 లక్షలవుతాయి. పాపకి 21 ఏళ్లు వచ్చినప్పుడు స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. ఇలా రూ.65 లక్షలవుతాయి.