మంత్రా మజాకా.. తన అనుచరులకు కళ్లుచెదిరే గిఫ్ట్‌ ఇచ్చిన మంత్రి

-

దీపావళి పండుగ అంటేనే లక్ష్మీపూజలకు ప్రత్యేకం. అంతేకాకుండా.. ఈ పండుగకు తమ దగ్గర పనిచేసే ఉద్యోగలకు సంస్థలు బోనాస్‌లు, స్వీట్లు పంచుతుంటాయి. అయితే.. దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌ తన అనుచరులకు కళ్లు చెదిరే ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్‌, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ ఊహించని విధంగా కానుకలను అందించారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు రూ. లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, ఒక చీర, ధోతీతో పాటు డ్రై ఫ్రూట్స్‌ను అందజేశారు. గ్రామపంచాయతీ సభ్యులకు రూ. లక్ష కంటే తక్కువ నగదు అందించారు. బంగారం ఇవ్వలేదు. ఇక కిలో వెండి, చీర, ధోతీ, డ్రై ఫ్రూట్స్ కానుకగా ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఖరీదైన కానుకలు అందించడంతో మంత్రి ఆనంద్ సింగ్‌ తీవ్ర విమర్శులు ఎదుర్కొంటున్నారు. దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు దేశ ప్రజలు.

1 lakh cash, gold, silver: Karnataka minister in hot water for costly gifts  to civic body members - India Today

 

దీపావళి సందర్భంగా ప్రజలు తమ బంధువులు, స్నేహితులకు బహుమతులు పంపిణీ చేస్తారు. సాధారణంగా అవి స్వీట్లు, బట్టలు వంటివి ఉంటాయి. అయితే, ఇక్కడ ఒక మంత్రిగారు మాత్రం తన అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఖరీదైన బహుమతులు అందజేశారు. ప్రస్తుతం ఈ వార్త వెలుగులోకి రావటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటక టూరిజం మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులు, బంధుమిత్రులకు బంగారం, వెండి, నగదును బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతుల వల్ల ఇప్పుడతను వివాదాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది.

దీపావళి కానుకగా రెండు రకాల బాక్స్‌లను పంపిణీ చేశారు కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్. ఒక బాక్సు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు, మరొకటి గ్రామ పంచాయతీ సభ్యులకు ఇచ్చారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యులకు కానుకగా అందజేసిన పెట్టెలో లక్ష రూపాయల నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, పట్టు చీర, ధోతి, డ్రైఫ్రూట్‌ బాక్స్‌ ఉన్నాయి. మరోవైపు గ్రామపంచాయతీ సభ్యులకు ఇచ్చిన పెట్టెలో బంగారం లేదు, నగదు కూడా తక్కువ. కానీ మిగతా విషయాలన్నీ ఉన్నాయి. ఇలా మొత్తం 35 మంది మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు, 182 మంది గ్రామ పంచాయతీ సభ్యులకు బహుమతులు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news