ఆర్ఆర్ఆర్ కు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి! ఇది కదా రాజమౌళి అంటే.!

-

జూనియర్ ఎన్టీఆర్  రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఎస్ఎస్ రాజమౌళి  డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా చాలా వారాలు నిలిచింది. ఈ సినిమా పై ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు తాజాగా, ఈ చిత్రం జపాన్‌లో విడుదలైంది. తమ సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందేఇప్పుడు  ఆర్ఆర్ఆర్ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ ఏడాదికి ఆర్ఆర్ఆర్ ను వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఆర్ఆర్ఆర్ ఈ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డు రావడంపై ఒక వీడియో ద్వారా రాజమౌళి తన సంతోషం ను అభిమానుల తో పంచుకున్నారు.

ఉత్తమ అంతర్జాతీయ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు సాటర్న్ అవార్డు వచ్చినందుకు చాలా  సంతోషంగా ఉంది. జ్యూరీ సభ్యులకు RRR సినిమా టీమ్ నుంచి ధన్యవదాలు. బాహుబలి-2 తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్ అవార్డు కావడం అమిత మైన ఆనందాన్ని ఇస్తోంది. ఈ అవార్డు ఫంక్షన్లో పాల్గొనాలని భావించినా.. ప్రస్తుతం జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా వున్నాను. విజేతలందరికీ నా అభినందనలు’ అని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.ఇలాంటి అవార్డు దేశం మొత్తంలో  మన జక్కన్నకు దక్కడం మన తెలుగు వారికి గర్వకారణం.

Read more RELATED
Recommended to you

Latest news