కోయంబత్తూర్‌ పేలుడు.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు స్టాలిన్ సర్కార్ డిమాండ్

-

ఈనెల 23న కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎన్‌ఐఏ దర్యాప్తు కోరింది. ఎన్‌ఐఏ దర్యాప్తునకు రికమెండ్‌ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు చేస్తున్న దర్యాప్తులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు వెలుగుచూడటంతో జాతీయ దర్యాప్తు సంస్థ సాయం కోరారు.

ఈ నెల 23న కోయంబత్తూరులోని ఉక్కడంలో ఓ కారులో సిలిండర్‌ పేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. పేలుడుకు ముందు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు పోలీసులకు పలు అనుమానాలు రేకెత్తించాయి. ఈ ఘటనలో మృతి చెందిన మొబిన్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి మొబిన్‌ ఇంటి నుంచి తెచ్చిన బస్తాను కారులో పెట్టడం, ఆ తర్వాత కారులో పేలుడు జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొబిన్‌ ఇంట్లో సోదాలు చేయగా భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news