BREAKING : మూడు రోజుల గ్యాప్ తర్వాత.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం కానుంది. నారాయణపేట మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది.
ఇక ఇవాళ 26.7 కిలో మీటర్ల పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. బండ్ల గుంటలో లంచ్ బ్రేక్ చేయనున్నారు. అలాగే..ఇవాళ రాత్రి గుడిగండ్లలో బస చేయనున్నారు రాహుల్ గాంధీ. అయితే.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. మునుగోడు నియోజక వర్గంలో… మాత్రం ప్రవేశించడం లేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారు.