కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో నాలుగవ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ధర్మ పూర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర నేడు మహబూబ్నగర్ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీకి మద్దతుగా సినీనటి పూనమ్ కౌర్ కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా రాహుల్, పూనమ్ తో ముచ్చటించారు. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీతో మాట్లాడినట్టు పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఈ పాదయాత్రలో పూనమ్ కౌర్ తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అలాగే పలువురు కాంగ్రెస్ నాయకులు, భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో కలిసి నడుస్తున్నారు. ఇక పాదయాత్ర చేస్తున్న సమయంలో.. సమస్యలపై ఫ్లాకార్డులు చూపిస్తున్న వారి వద్దకు రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.