వడ్లు కొనేడు చేత కాదు..రూ.100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారట అంటూ బీజేపీ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇవాళ మునుగోడులోని చండూరు లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని కొనియాడారు.
మునుగోడు లో ఈ ఉపఎన్నిక అవసరం లేకుండా వచ్చిందన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. గాడిదలకు గడ్డి వేసి.. ఆవులకు పాలు పిండితే రావన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే చేనేత కార్మికుల కుటుంబాల నుంచి ఒక ఓటు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు.. పాము కరుస్తుందని తెలిసి.. ఆ పాముకి ఓటు వేద్దామా? చేనేతలు బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.