BREAKING : మేడ్చల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

-

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా గుమ్మడిదలకు చెందిన టాటా ఏస్ వాహనం లో వెళ్తున్న 13 మందిలో ముగ్గురు చనిపోయారు. కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కంటైనర్​ ఇంజిన్​లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news