Breaking : మునుగోడులో ఉప ఎన్నిక వేళ 300 కోట్ల మద్యం అమ్మకాలు

-

తెలంగాణాలో ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారింది. ఉప ఎన్నిక కారణంగా వందల కోట్ల మద్యం నియోజకవర్గానికి చేరింది. బైపోల్ షెడ్యూల్ మొదలు.. ఎన్నిక జరిగే వరకు నెల రోజుల వ్యవధిలో మునుగోడులో దాదాపు రూ.300 కోట్ల మద్యం తాగారు. చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మద్యం మునుగోడుకు సరఫరా అయింది. రాష్ట్రంలో సెప్టెంబర్​లో రూ.2,700 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, అక్టోబర్​లో రూ.3,037 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ లెక్కలు చెబుతున్నాయి.

Munugode bypoll: Photos of liquor bottles go viral online

అంటే రూ.300 కోట్లకు పైగా సేల్స్ పెరిగాయి. ఈ ఏడాదిలో ఇవే రికార్డు స్థాయి సేల్స్ అని అధికారులు చెబుతున్నారు. ఉప ఎన్నిక వల్ల కొన్ని జిల్లాల్లో సేల్స్ పెరిగాయని, ఆ మద్యమంతా మునుగోడుకు సరఫరా అయిందని పేర్కొంటున్నారు. అక్టోబర్ 5న దసరా ఉన్నప్పటికీ, పండుగకు సంబంధించి మద్యం లిఫ్టింగ్ అంతా సెప్టెంబర్ నెలాఖరులోనే జరిగిందని చెప్పారు. కాగా, లిక్కర్ సేల్స్ ఇన్ కమ్ లో 85 శాతానికి పైగా సర్కార్ ఖజానాకే జమ అవుతోంది. దీంతో ఉప ఎన్నిక కారణంగా సర్కార్ కు ఆదాయం కూడా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news