జాక్వెలిన్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. స్పెషల్ ట్రీట్మెంట్ దేనికి..? : పాటియాలా కోర్టు

-

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సులభంగా దేశం దాటగలరని పటియాలా కోర్టుకు ఈడీ వెల్లడించింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై ఆమెకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు విన్న కోర్టు.. ఆమెను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.

జాక్వెలిన్‌ దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆమె విచారణకు సహకరించడం లేదని ఈడీ వాదిస్తోంది. ఈ కారణాలతో ఆమె బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తోంది. “మా జీవితం మొత్తం మీద మేం రూ.50 లక్షలు కూడా చూడలేదు. జాక్వెలిన్‌ మాత్రం విలాసాలకు రూ.7 కోట్లు ఖర్చుచేసింది. దేశం దాటేందుకు ప్రయత్నించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆమె వద్ద తగినంత డబ్బు ఉంది” అంటూ ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

“ఎల్‌ఓసీ జారీ చేసినా.. జాక్వెలిన్‌ను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదు? ఇతర నిందితులు జైల్లో ఉన్నారు. కానీ, ఆమె విషయంలో మీరు ప్రత్యామ్నాయం ఎందుకు ఎంచుకున్నారు?” అని ఈడీని కోర్టు ప్రశ్నించింది. ఆమె రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఇంతకుముందు జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news