ఢిల్లీ సీఎం మధ్యంతర బెయిల్‌ పై…. మే 10 న తీర్పు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే.ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. దీనిపై మే 10వ తేదీన మధ్యంతర ఆదేశాలను వెలువరిస్తామని జస్టిస్‌ ఖన్నా నేడు తెలిపారు. అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా అదే రోజున వాదనలు వింటామని వెల్లడించారు.

కాగా, ఢిల్లీ లిక్కుర్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుత జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. ఇక ఈ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news