రైతు బంధు ఆపడం నీచమైన కుట్ర : మంత్రి ఉత్తమ్ కుమార్

-

తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని, 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో దేశంలో అత్యధిక మెజార్టీ వస్తుందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రసంగాలు చూస్తే దేశం ఏమవుతుందో అని ఆందోళనగా ఉందని అన్నారు.

‘ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అని ఆశా భావం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలతో ముఖ్యమంత్రులను జైలులో వేస్తున్నారు అని మండిపడ్డారు. సన్నబియ్యం రెట్లు పెరగకుండా క్యాబినెట్‌లో చర్చించి చర్యలు తీసుకుంటాం. తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. తరుగు ఎక్కువగా తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాం. చివరి ధాన్యం గింజ వరకు అంతా కొంటాం. వర్షానికి, గాలికి కొట్టుకుపోయిన ధాన్యానికి కూడా నష్ట పరిహారం ఇస్తాం అని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ వల్లే రైతుబందు ఆగింది. ఆ రెండు పార్టీలు కలిసి రైతుబంధు ఆపాయి. రైతు బంధు ఆపడం నీచమైన కుట్ర అని’ మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news