ఇటీవల పలువురు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది తల్లి కాబోతున్నామని హ్యాపీ న్యూస్ చెప్తున్నారు. ఇటీవలే అలియా భట్ ఓ పాపకి జన్మనిచ్చింది. బిపాషా బసు కూడా తాజాగా తల్లి అయింది. తాజాగా మరో హీరోయిన్ తల్లి కాబోతున్నాను అంటూ పోస్ట్ చేసింది. బిగ్‌బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భవతి అని ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. భర్త జాన్ కొకెన్కు లిప్‌లాక్ ఇస్తూ దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అనేక భావోద్వేగాల మధ్య తమ ప్రయాణం మరో కీలక దశకు చేరుకున్నదని. ఒక చిన్న అద్భుతం తమ మధ్యలోకి రాబోతోందని.. 2023 తమకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని రాసుకొచ్చింది.
నిజానికి పూజా రామచంద్రన్‌కు విజె క్రెగ్‌తో డేటింగ్ చేసి.. 2017లో అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో విడిపోయింది. ఆ తర్వాత జాన్ కొకెన్తో సహజీవనం చేసింది. బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లొచ్చిన తర్వాత 2019లో జాన్ కొకైన్‌ను పెళ్లి చేసుకుంది. అప్పట్నుంచి జాన్ కొకెన్తో కలిసి విహారయాత్రలు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలను పూజా రామచంద్రన్.. ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ప్రెగ్నెంట్ అని ప్రకటించడంతో పూజా రామచంద్రన్‌కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.