ఇలాంటి చోట వుండేవాళ్ళకి కష్టాలేనట తెలుసా..?

-

చాణక్య మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లుగా అనుసరిస్తే జీవితం చాలా బాగుంటుంది. చాలా మంది వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చాణక్య చెప్పినట్లుగా అనుసరించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించేందుకు అవుతుంది.

చాణక్య ఇటువంటి ప్రదేశాలలో జీవించడం వలన కష్టాలు తప్పవని అంటున్నారు. మరి ఎక్కడ జీవించకూడదు ఎలాంటి చోట ఉంటే మనకి కష్టాలు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. డబ్బుకు లోటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండకూడదని చాణక్య అంటున్నారు. డబ్బుకు లోటు ఉన్నచోట అసలు మనం ఉండలేము అలానే నివాసం లేని ప్రదేశంలో కూడా ఉండకూడదు. పండితుడు లేని చోట నిరక్షరాస్యత ఉంటుంది.

రాజు లేని దేశంలో ఉండకూడదు రాజు లేని చోట ఉంటే అనైతికత అవినీతి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లు లేనిచోట కూడా ఉండకూడదు. ఇటువంటి చోట్ల రోగాల బారిన పడిపోతూ ఉంటారు ఇది నిజంగా ప్రమాదకరం.

నీటి వనరుల లేని చోట కూడా ఉండకూడదు దీని వలన కూడా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అసలు ఇటువంటి ప్రదేశాలలో ఉండకండి దీనివలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి అని ఆచార్య చాణక్య అంటున్నారు కాబట్టి ఇలా అనుసరిస్తే జీవితం బాగుంటుంది లేదంటే కష్టాలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news