Andhra Pradesh : రేపటి నుంచి మూడు రోజులపాటు పెన్షన్ల పంపిణీ

-

రేపటి నుండి అంటే మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది.మే 1న పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఉదయం 8:30 గంటల నుంచీ 11 గంటలలోపు డీబీటీ ద్వారా ఖాతాల్లోకి పెన్షన్‌ డబ్బులను జమ చేయనున్నారు.

ఎన్నికల చీఫ్ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే 3న ఇంటికే పింఛన్‌ డబ్బులను తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు అని స్పష్టం చేసింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాకు అకౌంటు ఆధార్ లింక్ కాని వారికి ఇంటివద్దకే పెన్షన్ పంపిణీ చేస్తారని వెల్లడించింది. సచివాలయాలకు ఎవరూ ఎండనపడి రావద్దని ,యూపీఐ పేమెంట్‌లు అందుబాటులో ఉండటంతో బ్యాంకు ఖాతాలకు బదిలీ త్వరగా అవుతుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉండగా.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ అధికారులు పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news