బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే ఇండియాని 3వ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాము : ఈటెల రాజేందర్

-

ప్రధాని నరేంద్ర మోడీపై ఈటల రాజేందర్ ప్రశంసల వర్షం కురిపించారు.మాజీ సైనికులతో నాగోలులో జరిగిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పదేళ్లక్రితం యువకులు సైన్యంలో చేరడమంటే కుటుంబాలకు చాలా బాధగా ఉండేది. వారు కుటుంబాలకు తెలియకుండా సైన్యంలో చేరేవారు. కానీ 2014లో ప్రధాని మోదీ వచ్చాక పరిస్థితి మారింది. తమ పిల్లలకు ఇతర ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎంత సంతోషపడేవారో సైన్యంలో చేరినప్పుడు కూడా అంతకంటే ఎక్కువే సంతోషపడుతున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు.

సైనికులు ధైర్యంగా బోర్డర్‌లో పనిచేసే పరిస్థితి ప్రధాని మోదీ కల్పించారు. సైనికుల భద్రత విషయంలో వారికి అన్ని రకాల హక్కులు కల్పించారు. తుపాకులు, యుద్ధ సామాగ్రి కూడా మేడిన్ ఇండియా నినాదంతో ఇక్కడే తయారవుతున్నాయి. అంతే కాదు, ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేయగలిగే స్థితి వచ్చింది. జమ్ముకాశ్మీర్‌లో గతంలో ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియదు. 24 గంటలూ సైనికులు కాపలా కాసినా హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉండేవి. కానీ మోదీ ప్రధానిగా వచ్చాక, అక్కడ భద్రత పెరిగింది. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది అని ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రశంసల జల్లు కురిపించారు.

 

మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో భారత్ మూడవ ప్రపంచ దేశంగా ఉండేది. కానీ నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక, దేశం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఇతర దేశాలు కూడా భారత్‌ను వారిమధ్య రాయబారిగా సంధి చేయాలని అభ్యర్థిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వారికి మధ్యవర్తిగా వ్యవహరించాలని, తగిన సలహాలను ఇవ్వాలని స్వయంగా రష్యా అధ్యక్షుడు అడిగారు.ప్రపంచం అంతా నేడు ఉద్యోగాల కొరత, ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితులలో 11 వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను ఐదవ ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత మోదీదే అని కొనియాడారు. మరోసారి బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని ప్రమాణం చేశారు ఈటల రాజేందర్.

.

Read more RELATED
Recommended to you

Latest news