వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

-

వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులపై జనసేన నేతలు కాకినాడ కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. జనసేన నేత పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు తోట త్రిమూర్తులు పై ఫిర్యాదు చేశారు. కాజులూరు మండలం పల్లిపాలెం సీలింగ్ భూములు ఆక్రమించి.. 35 ఎకరాలలో ఆక్వా సాగు చేస్తున్నారని పంతం నానాజీ, లీలా కృష్ణ, రాజబాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఆ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి ఎమ్మెల్సీ రూ. 5 కోట్ల రుణం కూడా తీసుకున్నాడని వివరించారు. ఆ భూమిలో చేపల చెరువును ఏర్పాటు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి దురాక్రమణాల నుంచి ప్రభుత్వ భూమిని విడిపించాలని కలెక్టర్ ను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news