ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్లు ఎక్కడున్నాయో తెలుసా?

-

ఒకచోట నుంచి మరోక చోటుకు వెళ్ళాలంటే మాత్రం రవాణా చెయ్యాల్సిందే..అందుకోసం బస్సు లేదా రైలు,అంతకు మించి ఉంటే విమానంలో కూడా వెళ్తూ ఉంటారు..రవాణా రంగంలో అతిపెద్ద వ్యవస్థ రైల్వేశాఖ. ప్రతి నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తోంది.


ప్రపంచంలో అతి పెద్ద రైల్వెలు వున్న దేశం మన భారత దేశం..భారత్‌ నుంచి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా టాప్‌ 10లో ఉన్నాయి. అత్యధిక స్టేషన్లు భారతదేశానికి చెందినవే ఉన్నాయి. పొడవైన ప్లాట్‌ఫామ్‌ భారతదేశంలోని కర్ణాటకలోని హుబ్లీలో ఉంది..ఇక ఆలస్యం ఎందుకు ఆ పది రైల్వేస్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

*. సిద్ధరూడ స్వామిజీ రైల్వే స్టేషన్‌ కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. ఈ హుబ్లీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ పొడవు 1505 మీటర్లు. ఈ స్టేషన్‌లో 8 ప్లాట్‌ ఫారమ్‌లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1, 8 పొడవైన ట్రాక్‌ను కలిగి ఉన్నాయి.
*. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నగరమైన గోరఖ్‌పూర్‌. ఇక్కడ ప్లాట్‌ ఫాం పొడవు 1366.33 మీటర్లు. ఇక మూడో స్థానంలో కేరళలోని కొల్లం స్టేషన్‌ ఉంది. ఇక్కడ ప్లాట్‌ ఫామ్‌ పొడవు 1180.5 మీటర్లు.
*. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడి ప్లాట్‌ఫామ్‌ పొడవు 1072.5 మీటర్లు.
*. తర్వాత స్టేట్‌ స్ట్రీట్‌ సబ్‌వే ఆఫ్‌ చికాగో (యూఎస్‌) ఐదో స్థానంలో ఉంది. దీని ప్లాట్‌ఫామ్‌ పొడవు 1067 మీటర్లు. ఇది ఉత్తర అమెరికాలో పొడవైన ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు ఉంది.
*. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ రైల్వే జంక్షన్‌ కూడా ఈ జాబితాలో ఉంది. ఆది ఆరో స్థానంలో ఉంది. దీని పొడవు దాదాపు 900 మీటర్లు.
*. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో పోంటానా అనే ఆటో క్లబ్‌ స్పీడ్‌వే స్టేషన్‌ ఉంది. దీని పొడవు 791 మీటర్లు. ఇది ఐరోపాలోని పొడవైన స్టేషన్‌లలో ఇది ఒకటి.
*. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ స్టేషన్‌ 802 మీటర్ల పొడవు ఉంది.
*. బ్రిటన్‌కు చెందిన షెరటన్‌ షటిల్‌ టెర్మినల్‌ ఫోక్‌స్టోన్‌ (UK). దీని ప్లాట్‌ఫాం పొడవు 731 మీటర్లు
*. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ఝూన్సీ స్టేషన్‌ ఉంది. దీని ప్లాట్‌ఫాం పొడవు 770 మీటర్లు .
*. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఈస్ట్‌ పెర్త్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం పొడవు కూడా అంతే. ఇది ఆస్ట్రేలియాలో అతి పొడవైన స్టేషన్‌గా గుర్తింపు ఉంది..ఇవి ప్రపంచంలో కల్లా అతిపెద్ద రైల్వేస్టేషన్లు..

Read more RELATED
Recommended to you

Latest news