తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన తమన్నా..!!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ తమన్నా.. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తమన్నా పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది తమన్నా. సుమారుగా 15 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో తన హవా కొనసాగించింది . ఈ మధ్యకాలంలో సినిమాలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ తమన్నా వివాహం చేసుకోబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

అంతేకాకుండా ఒక వ్యాపారవేత్తని ఈమె వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు రావడంతో అందుచేతనే తమన్న ఏ సినిమాలకు ఒప్పుకోలేదని విషయం సోషల్ మీడియాలో పలు వెబ్సైట్ లలో కథలుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాలన్నిటికీ తమన్న గట్టి కౌంటర్ ఇస్తూ పలు రూమర్లకు చెక్ పెట్టే విధంగా.. ఇతనే నా భర్త బిజినెస్ మెన్ అంటూ తాను నటించిన F-3 సినిమాలోని తన పాత్రకు సంబంధించిన ఒక క్లిప్పింగును పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

దీంతో తమన్నా మ్యారేజ్ రూమర్స్ అనేవి హ్యాష్ ట్యాగ్ జత చేసి షేర్ చేసింది. ఇక ఎఫ్ త్రీ సినిమాలో తమన్నా కూడా ఒక మగాడివేషంలో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆ దృశ్యాలని షేర్ చేస్తూ తనపై వస్తున్న రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక తమన్నా సినీ కెరియర్ విషయానికి వస్తే చివరిగా బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news