ఈసంవత్సరం జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు మరణానంతరం నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాలు భారత రత్నకు ఎంపికయ్యారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించిన సంగతి తెలిసిందే. ఆయనకు భారత రత్నను ఆగస్టు 8(గురువారం) ప్రదానం చేయనున్నారు.
ఈసంవత్సరం జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు మరణానంతరం నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాలు భారత రత్నకు ఎంపికయ్యారు.
2015 లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండర్ మదన్ మోహన్ మాలవీయాకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రకటించడం.
ప్రణబ్, నానాజీ, భూపేన్.. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటి వరకు 48 మంది భారతరత్నకు ఎంపికయ్యారు. నానాజీ దేశ్ ముఖ్… జనసంఘ్ నాయకుడు, సామాజిక వేత్త కాగా… భూపేన్ హజారికా… అస్సామీ వాగ్గేయకారుడు.