చంద్రముఖి సీక్వెల్లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్..

-

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి చిత్రం ఎంత ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటికీ ఆ సినిమా ను అభిమానులు మరచిపోలేరు ముఖ్యంగా అందులో జ్యోతిక నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అయితే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుంది ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించాను అన్నట్టు సమాచారం..

చంద్రముఖి చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి.. తమిళంతో పాటు తెలుగులో ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే.. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది ఇందులో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు ఇప్పటికే మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.. అయితే ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించాను ఉందని తెలుస్తోంది..

హారర్.. థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ మైసూర్ లో పూర్తయ్యాక కొంత భాగం హైదరాబాదులో కూడా జరిగింది.. ఇందులో రాధిక మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.. చంద్రముఖిను తెరకెక్కించిన పి వాసునే ఈ సీక్వెల్ ను తెరకేక్కిస్తున్నాడు..అయితే ఇందులో జ్యోతిక నటనను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే అంతటి స్థాయిలో నటించటానికి ఎందరో హీరోయిన్స్ ను అనుకున్నట్టు సమాచారం ముందుగా ఈ పాత్ర కోసం త్రిషను తీసుకోవాలి అనుకున్నట్టు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి.. అయితే కంగనాను హీరోయిన్గా తీసుకోవడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.. అయితే ఇందులో కంగనా ఏ పాత్రను పోషిస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news