బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. అతి చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవానికి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇచ్చారు. తెలంగాణ భవన్ లో ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కి మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. లగచర్ల మహిళలు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
భూ సేకరణ వివాదం తలెత్తిన వివాదం తలెత్తిన సమయంలో కొందరూ పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని.. ఈ ఘటన పై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ను కలిశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిని పోలీసుల తీరును nhrc తీవ్రంగా తప్పు పట్టింది. నివేదిక తర్వాతనైనా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి తొలగించాలని లేదంటే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.