సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ఇవ్వాలి : సీపీఐ నారాయణ

-

ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేపట్టి అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేసినా, అక్కడ లైవ్ పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. సోదాలు చేసే సమయంలో ఏం జరుగుతోందో లైవ్ ద్వారా అందరికీ తెలుస్తుందని అన్నారు. “నేనీ మాట ఎందుకు అంటున్నానంటే… బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వ్యతిరేకించే పార్టీల పైనా, వ్యాపార సంస్థలపైనా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. దాడులు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి వెళ్లిపోతున్నారు. అధికారుల వద్దే కెమెరాలు ఉంటాయి కాబట్టి సోదాలు లైవ్ లో చూపించాలి. అక్కడే ఏం జరిగిందో లైవ్ లోనే ప్రకటించవచ్చు.

CPI Narayana : ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఓ కల : నారాయణ

లైవ్ లో చూపించకపోతే మాత్రం అది కక్ష సాధింపు చర్యల కిందే భావించాల్సి ఉంటుంది” అని నారాయణ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. సీపీఐ నేత నారాయణ పట్టుబట్టి అనుకున్నది సాధించారు. రుషికొండ ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లబోతున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీపీఐ నారాయణ రుషికొండ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఆయన ఈనెల 25 ఉదయం 9 గంటలకు రుషికొండను పరిశీలించనున్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి నవంబర్ 1 లేదా 2న రుషికొండను పరిశీలించేందుకు సమయం ఇచ్చారు.. కానీ నారాయణ ఆ సమయంలో విదేశాల్లో ఉండటంతో కుదరలేదు.

Read more RELATED
Recommended to you

Latest news