లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న నయనతార నిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు… కెరియర్ పరంగా ఎంత పాపులర్ అయిందో తన పర్సనల్ లైఫ్ విషయం కూడా ఎప్పటికప్పుడు అంతే హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. ముఖ్యంగా నయనతార-స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సరోగసి ద్వారా ఇద్దరు కవలలు జన్మనిచ్చి మరింత హాట్‌టాపిక్‌గా మారారు. ఈ విషయం అప్పుడు పెద్ద వివాదానికే దారి తీసింది. అయితే తగిన ఆధారాలు చూపించి నయనతార దంపతులు ఆ వివాదం నుంచి బయటపడ్డారు. అలాగే తాజాగా విగ్నేష్ తల్లి నయనతార కోసం మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..
కొత్త కోడలిపై ఆమె అత్త చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కోడలిని తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు ఈమె.. “మా అబ్బాయి మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్, నా కోడలు ఓ స్టార్ హీరోయిన్. వాళ్లు ఇద్దరూ కష్టపడే వ్యక్తిత్వం కలవారే. నా కోడలు అయితే చాలా మంచి మనస్తత్వం కల అమ్మాయి. ఎవరికి ఏ కష్టం అన్నా తానే ముందుంటుంది.. అందర్నీ సొంతవాళ్లుగా భావించే మనస్తత్వం నయనతారది.. వాళ్ల ఇంట్లో పనిచేసే వాళ్లలో ఒకళ్లు రూ.4 లక్షల అప్పు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతుండగా.. ఆ విషయం తెలుసుకుని వాళ్ల అప్పు తీర్చేసింది. 10 మంది మనుషులు చేసే పనిని నయనతార ఒక్కతే చేస్తుంది. ఇల్లుని చక్కదిద్దుకోవడం, పెద్దవాళ్లను చూసుకోవడం ఆమెకు బాగా తెలుసు. ఇద్దరికీ వారి వృత్తి అంటే అపారమైన గౌరవం. వాళ్ల వృత్తిలో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తారు.. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిన ఒదిగి ఉండాలి అనే లక్షణం ఉన్న వారిద్దరిని చూసి నాకు చాలా ముచ్చట వేస్తుంది.. ” అంటూ కోడలని ప్రశంసలతో ముంచెత్తారు.