బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏ అవార్డుకైనా అర్హులే: సోము వీర్రాజు

-

ప్రతి ఏటా విజయనగరంలోని గురజాడ సాహిత్య సాంస్కృతిక సమాఖ్య గురజాడ పురస్కారాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకూ ఎందరో కళాకారులకు, కవులకు ఈ పురస్కారం అందించారు. అయితే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి గురజాడ పురస్కారం ఇవ్వడంతో.. విజయనగరంలో కవులు, కళాకారులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడం వివాదంగా మారింది. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ, విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

Somu Veerraju counters Chandrababu's remarks on alliances, says don't need  anyone's sacrifices

తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చాగంటి గారు అద్భుతమైన జ్ఞాన భాండాగారం అని కీర్తించారు. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని సోము వీర్రాజు విమర్శించారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాగంటి గారి పేరు తెగ వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news