వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. 957 ఖాళీలు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ లో నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ ని తీసుకు రావడం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

రాష్ట్రం లోని వైద్య ఆరోగ్య శాఖలో 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. అప్లై చేసుకోవాలని అనుకునే వారు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీలోగా ఆయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తులని సబ్మిట్ చేసేయాలి.

ఇదిలా ఉంటే మెరిట్‌ లిస్ట్‌ను 19వ తేదీన ప్రకటిస్తారు. డిసెంబర్‌ 21, 22వ తేదీల్లో కౌన్సిలింగ్‌, అపాంట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చేస్తారు. యుద్ధప్రాతిపదికన పోస్టులు అయితే సీఎం జగన్ ఆదేశాల మేరకు భర్తీ చేస్తారట. ఇక కార్యాలయ వివరాల లోకి వెళితే.. అర్హత కలిగిన వాళ్ళు ఈ కింద డైరెక్టర్ కార్యాలయం లో అప్లై చేసుకోవాల్సి వుంది.

రీజనల్ డైరెక్టర్, బుల్లయ్య కాలేజీ ఎదురుగా, రేసపువానిపాలెం. విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ కార్యాలయం లో సబ్మిట్ చెయ్యచ్చు.
జిల్లా ఆసుపత్రి ప్రాంగణం, రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నందు సబ్మిట్ చెయ్యచ్చు.
పాత ఇటుకులబట్టి రోడ్ , అశ్విని ఆసుపత్రి వెనుక, గుంటూరు లో సబ్మిట్ చెయ్యచ్చు.
పాత రిమ్స్ ప్రాంగణం, కడప. వైఎస్సార్ కడప రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నందు సబ్మిట్ చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news