ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి నేత బిఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే కొనసాగిస్తున్నట్లు ఆదేశించింది. బి ఎల్ సంతోష్ కి 41 ఏ సిఆర్పిసి నోటీసులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బిఎల్ సంతోష్ కి ఇప్పటికే పలుమార్లు అవకాశాన్ని కల్పించామని. అతనిపై ఉన్న స్టే ని ఎత్తివేయాలని కోరారు. 41 ఏ సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసు ప్రకారం సంతోష్ విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు.
అయితే 41 సిఆర్పిసి పై స్టే ఉండడం వల్ల విచారణకు హాజరుకమ్మని ఆదేశించలేమని తెలిపింది హైకోర్టు. పిటీషనర్ బిఎల్ సంతోష్ కుమార్ కి సంబంధించిన వాదనలు కూడా ఇంకా వినాల్సి ఉందని తెలిపింది. వాదనలు విన్న తర్వాత తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపింది. ఈనెల 13 వరకు ఈ స్టే ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఇక మరోవైపు జగ్గు స్వామి కి కూడా ఊరట కల్పించింది. 41 సీఆర్పీసీ నోటీసులపై స్టే విధించింది.