రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగిపోతూనే ఉంది. దానితో పాటుగా మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. చాలా మంది ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల ఫేక్ న్యూస్ లని కూడా స్ప్రెడ్ చేసేస్తూ మోసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం.
నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వార్త సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది. అయితే మరి సోషల్ మీడియా లో వచ్చిన ఆ వార్త నిజమా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. కేంద్రం మన కోసం ఎన్నో స్కీమ్స్ ని తెచ్చింది. అయితే ఇప్పుడు మహిళలకి రెండు లక్షలని కేంద్రం ఇస్తోందని.. నారి శక్తి యోజన కింద ఈ బెనిఫిట్ ని పొందచ్చని దానిలో ఉంది.
'इंडियन जॉब' नामक #YouTube चैनल द्वारा यह दावा किया जा रहा है कि केंद्र सरकार सभी महिलाओं को 'प्रधानमंत्री नारी शक्ति योजना' के तहत 2 लाख 20 हजार रूपए देने जा रही है।#PIBFactCheck
▶️यह दावा #फर्जी है।
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं लाई गई है। pic.twitter.com/FL3Ji8Oydc
— PIB Fact Check (@PIBFactCheck) December 6, 2022
మరి ఇక ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ప్రధాన మంత్రి నారి శక్తి యోజన కింద ఇరవై వేల మహిళలకి రూ.2.20 లక్షలు ఇస్తున్నారని వచ్చిన న్యూస్ ఫేక్ న్యూస్. ఇది నిజం కాదు. మహిళలకి రూ.2.20 లక్షలు ని కేంద్రం ఇవ్వడం లేదు. ఇది నకిలీ వార్త మాత్రమే. కనుక అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దు.