ఎలాంటి వడ్డీ లేకుండా ప్రభుత్వం నుండి రూ.50,000 లోన్..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా రకాల లాభాలని ఇస్తున్నారు. దీనితో చాలా మందికి బెనిఫిట్ కలగనుంది. అయితే మోడీ తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ‘ప్రధానమంత్రి స్వానిధి యోజన’ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో మీరు డబ్బులు పెడితే చక్కగా లాభాలు వస్తాయి. రూ.50,000 వరకు రుణం పొందవచ్చు.

వడ్డీ లేకుండా లోన్ ని పొందొచ్చు. వీధి వ్యాపారుల కోసం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. ఒకసారి లోన్ కట్తేసాక వడ్డీ రేటు లేకుండా రెండో సారి లోన్ డబుల్ అవుతుంది. ఈ లోన్ ని ఒక సంవత్సరం వ్యవధిలో తిరిగి చెల్లించాలి. లేదంటే నెలవారీ వాయిదాలలో కూడా చెల్లించవచ్చు. భారీ సబ్సిడీ ఇస్తోంది. అలానే క్యాష్‌బ్యాక్ కూడా.

ప్రధానమంత్రి స్వానిధి యోజన స్కీమ్ కోసం పూర్తి వివరాలని చూస్తే.. వీధి వ్యాపారులు మొదలైన వాళ్ళకి ఆర్థిక సమస్యలను తొలగించడం కోసం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. 50 వేల రూపాయల లోన్ ని ఈ స్కీమ్ ద్వారా ఇస్తున్నారు. డిసెంబర్ 2024 వరకు ఈ లోన్ ని తీసుకోవచ్చు.

ఈ లోన్ పొందేందుకు అర్హులు ఎవరు..?

రోడ్డు పక్కన స్టేషనరీ దుకాణాలు వున్నవాళ్లు అర్హులే.
చిన్న కళాకారులు కూడా అర్హులే.
భారతదేశానికి చెందినవారు అయ్యుండాలి.
వీధి వ్యాపారులు అప్లై చేసుకోవచ్చు.
కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారం దెబ్బతిన్న వారు కూడా ఈ లోన్ ని పొందొచ్చు.

ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి:

ఆధార్ కార్డు, పాస్‌ఫోటో సైజు ఫోటో, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్‌బుక్ ఫోటో కాపీ అవసరం అవుతాయి. pmsvanidhi.mohua.gov.in ను ద్వారా ఈ లోన్ ని మీరు పొందొచ్చు. .

 

 

Read more RELATED
Recommended to you

Latest news