ఫ్రెంచ్ చక్రవర్తిలా చంద్రబాబు మారిపోయాడని వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. తన పార్టీకి 2019 వరకు అండగా ఉన్న బీసీలు దూరమయ్యేసరికి…చంద్రబాబు ఉన్మాదిలామారి పిచ్చెక్కి రోడ్లపై పడ్డాడని మండిపడ్డారు సాయిరెడ్డి.
తాను లేకపోతే రాష్ట్రమే ఉండదన్న స్థితికి చేరిపోయాడు. “నా తర్వాత ప్రళయం వస్తుంది, ప్రపంచం అంతమైపోతుంద”న్న ఫ్రెంచ్ చక్రవర్తి లూయిని గుర్తుకు తెస్తున్నాడని నిప్పులు చెరిగారు.
పెద్దోడా…చంద్రం! బీసీలంటే దేశానికే బ్యాక్ బోన్, భారతావనికే చైతన్యులు. వయోభారంతో నీకు మతిభ్రమించింది. అవమానించడంలో నిన్ను మించినవారు లేరు. బీసీ అనేగా కుటుంబమే లేదంటూ ప్రధాని మోదీ గారి వ్యక్తిత్వాన్ని, అయన తల్లిని అవమానించావు? ఈ వీడియో చూడు!అంటూ మోడీని తిట్టిన చంద్రబాబు వీడియోను షేర్ చేశారు సాయిరెడ్డి.
పెద్దోడా…చంద్రం! బీసీలంటే దేశానికే బ్యాక్ బోన్, భారతావనికే చైతన్యులు. వయోభారంతో నీకు మతిభ్రమించింది. అవమానించడంలో నిన్ను మించినవారు లేరు. బీసీ అనేగా కుటుంబమే లేదంటూ ప్రధాని మోదీ గారి వ్యక్తిత్వాన్ని, అయన తల్లిని అవమానించావు? ఈ వీడియో చూడు! pic.twitter.com/soCn9ix80d
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2022